Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. ఖాఖీలు ఇలా రోడ్డున పడ్డారు..

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త దాడికి దిగాడు.

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (10:09 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త దాడికి దిగాడు. ఇలా ఇద్దరు పోలీసు అధికారుల మధ్య వివాహేతర బంధం బట్టబయలై, హైదరాబాద్, కేపీహెచ్బీ కాలనీలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా అధికారిణి భరణి భర్త బంధువులతో వారిపై దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీవీ చానల్ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్యా సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పాడు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments