Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో చీటీలు, డిపాజిట్లు: రూ.45 కోట్లతో పరారైన మహిళ

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:11 IST)
చీటీలు నిర్వహించడం, అధిక వడ్డీకి డిపాజిట్లు (మైక్రో ఫైనాన్స్‌ మాదిరి) చేసుకోవడం ఆమె వృత్తి. డిపాజిట్‌ చేసుకొన్న నగదుకు మూడేళ్లకు రెట్టింపు మొత్తం ఇచ్చేది. డబ్బుకు ఆశ పడిన ఎంతో మంది ఆమె వద్ద నగదు జమ చేశారు. కొవిడ్‌ కారణంగా తమ డబ్బు తిరిగి చెల్లించాలని డిపాజిట్‌దారులు ఒత్తిడి తేగా సదరు మహిళ రూ.45 కోట్లతో పరారైంది.

వివరాలు.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సత్యనారాయణ పేట కేంద్రంగా విజయలక్ష్మి అనే మహిళ ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీలు, చీటీల వ్యాపారం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఆమె ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఈమె వద్ద 20 మందికి పైగా ఏజెంట్లు, అకౌంటెట్లు పని చేస్తున్నారు.
 
వీరు హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, బాగేపల్లి, గౌరిబిదనూరు, పావగడ ప్రాంతాల్లో నగదు సేకరించడం, తిరిగి చెల్లిస్తుండటంతో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. రెండు దశాబ్దాలుగా నమ్మకంగా ఉండటంతో తమ సొమ్ములకు భద్రత ఉంటుందని నమ్మిన వారు రూ.లక్షల్లో డిపాజిట్‌ చేశారు. కొవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు అనుకూలించక తమ డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఏజెంట్లపై ఒత్తిడి చేశారు.
 
కొవిడ్‌ సాకు చూపి వాయిదా వేసుకొంటూ వచ్చిన నిర్వాహకురాలు ఒత్తిడి భరించలేక పది రోజుల కిందట ఇల్లు వదిలి పరారైంది. దీంతో డబ్బు డిపాజిట్‌ చేసిన వారు సోమవారం ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. మొత్తం 1600 మందికి చెందిన రూ.45 కోట్లతో ఆమె పరారైంది. ఈ విషయమై హిందూపురం రెండో పట్టణ సీఐ మన్సూరుద్దీన్‌ను వివరణ కోరగా నగదు మోసాలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments