Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంటరి మహిళ కనబడిందా అంతే, యంబీఏ చదివినవాడు ఏం చేస్తున్నాడో చూడండి

ఒంటరి మహిళ కనబడిందా అంతే, యంబీఏ చదివినవాడు ఏం చేస్తున్నాడో చూడండి
, సోమవారం, 2 ఆగస్టు 2021 (20:30 IST)
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల మూడు బంగారు పుస్తేల త్రాడులతో  పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
పోలీసులు అరెస్టు చేసిన వారిలో మొదటి నిందితుడు పుల్లూరి రాజేష్, వయస్సు 32, నివాసం ధర్మారం గ్రామం, జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా కాగా మరో నిందితుడు బత్తులరాజు, వయస్సు 32, గోల్లగూడెం గ్రామం, సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
 
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీస్ అరెస్టు చేసిన నిందితులు ఇద్దరు ఒకే కళాశాలో డిగ్రీ కల్సి చదవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహం కుదరటంతో పాటు నిందితులిద్దరు యం.బి.ఏ చదువుకోని నిందితుల్లో ఒకరైన పుల్లూరి రాజేష్ పాన్‌షాపు నిర్వహిస్తుండగా, మరో నిందితుడు బత్తుల రాజు మెడికల్ రిప్రజెంటివ్ పనిచేస్తువుండేవారు. వీరు ఇరువురు మంచి స్నేహితుల కావడంతో నిందితులు ఇద్దరు తమ వచ్చిన సంపాదనతో మధ్యసేవించడంతో పాటు జల్సాలు చేసేవారు.

జల్సాలకు వీరి అదాయం సరిపోకపోవడంతో నిందితులిద్దరు సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందుకోసం ఒంటరిగా వున్న మహిళలను లక్ష్యంగా చేసుకోని మహిళల మేడలోని బంగారు గోలుసులను చోరీ చేసేందుకు సిద్ధపడటంతో పాటు నగరాల్లో చైన్ స్నాచింగ్ చేస్తే సిసి కెమెరాల ద్వారా పోలీసుల చిక్కుతామని గుర్తించి, గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్ళే మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్లకు పాల్పడితే ఎవరు గుర్తించరని నిర్ణయించుకోని నిందితులిద్దరు చోరీలు చేసేందుకు సిద్ధపడ్డారు.

నిందితులు ఇరువుర తాము అనుకున్న రీతిలో మూడు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇందులో నిందితులు ఈ నెల 19వ తేదిన వేలేరు మండలం, కన్నారం గ్రామ శివారు ప్రాంతంలో ఒంటరిగా వున్న మహిళను కొట్టి ఆమె మెడలోని బంగారు పుస్తేల త్రాడు బలవంతంగా లాక్కోని పారిపోగా, ఇదే రీతిలో నిందితులు ఈ సంవత్సరం మార్చ్ మాసంలో 24వ తేదీన ధర్మసాగర్ మండలం, ఉనికిచెర్ల ఆవుటర్ రింగ్ ప్రాంతంలో మరియు గత నెల జూన్ 27వ తేదిన సిద్ధపేట జిల్లా, అక్కన్నపేట మండలం, రేగోండ గ్రామ శివారు ప్రాంతంలో ఒంటరిగా వున్న మహిళను కోట్టి బంగారు పుస్తెల త్రాడు బలవంతంగా లాక్కోని ద్విచక్ర వాహనంపై పారిపోయేవారు.

నిందితులు చోరీ చేసే ముందు ముందుగా తమ స్వగ్రామల నుండి తమ ద్విచక్రవాహనాలపై ముందుగా నిందుతులో ఒకరి ద్విచక్రవాహనాన్ని తమ అనుకూలమైన ప్రాంతంలో పార్కింగ్ చేసి మరో ద్విచక్ర వాహనంపై చైన్ స్నాచింగ్ చేసేందుకు బయలుదేరివేళ్ళేవారు. ఈ క్రమంలో నిందితులు తమ వాహనం వెనుకవైపు వాహనం నంబర్ కనపడకుండా నల్లరంగు ప్లాస్టర్‌తో మూసి వేసేవారు. చోరీ అనంతరం నిందితులద్దరు తమ వాహనాల్లో తిరిగి తమ ఇళ్లకు చేరుకోనేవారు.

ఈ చోరీలపై సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా సూచనల మేరకు కాజీపేట ఎ.సి.పి రవీంద్ర కుమార్ అధ్వర్యంలో ధర్మసాగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్, వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు నిర్వహించగా , ప్రస్తుతం పోలీసులు తమ అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితులను గుర్తించడంతో పాటు వారి కదలికలపై నిఘా పెట్టారు.

నిందితులిద్దరు తామ చోరీ చేసిన బంగారు పుస్తెల త్రాడులను హైదరాబాద్‌లో అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా చేయాలని నిందితులు నిన్నటి రోజు సాయంత్రం వాహనంపై మణికొండకు వస్తుండగా ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ అదేశాల మేరకు వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు, ప్రొబేషనరీ ఎస్.ఐ హఫీజా తమ సిబ్బందితో కల్సి వేలేరు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

నిందితులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహన తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దానితో వారిని పోలీసులు వెంబడించి పట్టుకొని తనీఖీ చేయగా నిందితుల వద్ద మూడు బంగారు పుస్తెల త్రాళ్లను గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన చైన్ స్నాచింగ్ చోరీలను అంగీకరించారు. చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన కాజీపేట ఎ.సి.పి రవీందర్ కుమార్, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేష్, వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు, ప్రొబేషనరీ ఎస్.ఐ హఫీజా, ఎ.ఎస్.ఐ ఉమాకాంత్, కానిస్టేబుల్లు రమేష్ బాబు, ఆహ్మద్, హసనపర్తికానిస్టేబుల్ క్రాంతికుమార్,రమేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పందన ఫిర్యాదులకు ప్రాముఖ్యత ఇవ్వండి: తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అప్పల నాయుడు