Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ముందు బోరున విలపించిన అయ్యన్నపాత్రుడు... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:24 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా వైపు మొగ్గు చూపడాన్ని టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిని తలచుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ కంటతడిపెడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టడం. 
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులంతా హజరయ్యారు. 
 
ఈ సమావేశానికి హాజరైన అయ్యన్నపాత్రుడు ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని, నేతలందరూ తీవ్రంగా కష్టించారని, అయినాగానీ ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చంద్రబాబుతో పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు మూతపడిన స్థితిలో దర్శనమివ్వడాన్ని చూడలేక పోతున్నామంటూ అయ్యన్న కంటతడి పెట్టడం పార్టీ వర్గాలను కూడా కదిలించింది. ఆయన్ను పార్టీ అధినేతతో పాటు.. ఇతర సభ్యులు ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments