Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

ఠాగూర్
బుధవారం, 2 జులై 2025 (09:03 IST)
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను చెన్నై ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ ఇద్దరు ఉగ్రవాదులు దశాబ్దాలు రహస్య జీవితం గడుపుతూ వచ్చారు. వీరిని చెన్నై ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న సిద్ధిఖీ, మహ్మద్ అలీ అనే సోదరులు మారు పేర్లతో గత 30 యేళ్లుగా రాయచోటిలో చీరల వ్యాపారం చేస్తూ రహస్యంగా జీవిస్తున్నారు. 
 
వీరు గత 1985లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎక్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్టు వీరిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరు ఇద్దరు మారుపేర్లతో రాయచోటిలో ఉన్నట్టు గుర్తించిన చెన్నై ఐబీ అధికారులు.. మంగళవారం స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. 
 
వీరు ఉన్న నివాసం నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ చెన్నై తీసుకుని వెళ్లారు. గత మూడు దశాబ్దాలుగా బట్టల వ్యాపారం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ఈ సోదరులు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారని తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పైగా, తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు ఈ ఇద్దరు అన్నదమ్ములను అరెస్టు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments