Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

Advertiesment
Naveen, 30 years Prudhivi and terachapa team

దేవీ

, సోమవారం, 5 మే 2025 (17:26 IST)
Naveen, 30 years Prudhivi and terachapa team
అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాఖి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు.

అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎం ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.
 
ఈ సందర్బంగా 30 ఇయర్స్ పృద్వి గారు మాట్లాడుతూ... "తెరచాప ఒక అద్భుతమైన సినిమా. నవీన్ ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్ గుర్తొస్తున్నాడు. ఆయన సినిమా కోసం ఎంత కష్టపడతాడో నవీన్ కూడా అంతే కష్టపడుతున్నాడు. కచ్చితంగా ఇతను మన టాలీవుడ్ కి విక్రమ్ లాంటి హీరో అవుతాడు. ఈ సినిమా కోసం నవీన్ చాలా కష్టపడ్డాడు. అతన్ని చాలా అభినందించాలి. రాత్రి పగలు కష్టపడ్డాడు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యలేదు.అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడి ఆసుపత్రిపాలు కూడా అయ్యాడంటే అర్ధం చేసుకోండి. నిజంగా అతన్ని కష్టాన్ని అభినందించాలి. తన ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు.అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కాలని మనసారా కోరుకుంటున్నా" అని అన్నారు.
 
డైరెక్టర్ జోయెల్ జార్జ్ మాట్లాడుతూ.. "ఈ సినిమాని మంచి మాస్ సినిమాగా తీసాం. అలాగే ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి రిఫరెన్స్ లు కూడా సినిమాలో మీరు చూడవచ్చు. ఈ సినిమా కోసం మా నటులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ళ సహకారం లేకుంటే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చుండేది కాదు. మంచి ఔట్ పుట్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు.
 
ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం మాట్లాడుతూ.." ముందుగా మా సినిమాని ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీడియా వారికి, అందరికి కృతజ్ఞతలు.. నాకు ఇదే కొత్త. సినిమా రంగంలో ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాం" అని అన్నారు.
 
హీరో నవీన్ మాట్లాడుతూ.. " ఈ సినిమా గురించి మాట్లాడే ముందు కాశ్మిర్ ఉగ్రదాడి గురించి మాట్లాడాలి. ఎందుకంటే దాని గురించి మాట్లాడే అవకాశం నాకు ఇప్పుడే వచ్చింది. నిజంగా ఆ ఘటన నన్ను బాధించింది. చాలా కోపంగా కూడా ఉన్నాను. ఈసారి మన అధికారులు పాకిస్తాన్ తీవ్రవాదులపై చేసే దాడి వాళ్ళు కలలో కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే.. నాపై నమ్మకంతో ఈ సినిమా మీద 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. చాలా మంచి ఔట్ పుట్ వచ్చింది. తప్పకుండా మీకు నచ్చుతుంది. " అని అన్నారు.
 
నటుడు కార్తీక్ రత్నం మాట్లాడుతూ... "తెరచాప చిత్ర టీజర్ చాలా బాగుంది. నాకు లేటుగా తెలియడంతో వేరే పని ఉన్నప్పటికీ నవీన్ కోసం ఇక్కడికి వచ్చాను. నవీన్ రాజ్ కు నేను ఎంతో సపోర్ట్ గా నిలుస్తాను. దర్శకుడి మేకింగ్ అలాగే బిజిఎం ఇంకా సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందం అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి