Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త టెక్నాలజీతో చౌకగా మంచి నీటి సరఫరా: మంత్రి మేకపాటి

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (20:16 IST)
సరికొత్త టెక్నాలజీతో మెట్టప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సురక్షిత మంచినీటిని చౌకగా సరఫరా చేసే దిశగా మంత్రి మేకపాటి అడుగులు వేస్తున్నారు. అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆర్వో ప్లాంట్ ను అక్టోబర్ 30న ఆత్మకూరులో ప్రారంభించనున్నారు.

ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా తొలిసారిగా మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గంలోని ఆత్మకూరులో శుద్ధి చేసిన నీటిని కోరుకున్నవారి ఇంటికే నేరుగా సరఫరా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు కానున్న ఆర్వో వాటర్ డైరెక్ట్ టు హోమ్ కార్యక్రమం  ఆత్మకూరులో ప్రారంభించిన అనంతరం నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. 

పెన్నా నది నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా నీటిని ఆర్వో ప్లాంట్ వద్దకు తీసుకువచ్చి అక్కడ ప్యూరిఫై చేసి.. పట్టణ ప్రజలు కోరుకున్న ఇంటికి ఈ పైపులు అమరుస్తారు. ముందుగానే డబ్బు చెల్లించి నీటిని పొందే ఈ ప్రాజెక్టులో 20 లీటర్ల నీటిని కేవలం రూ.5 అందించనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. సెల్ ఫోన్ రీఛార్జ్ తరహాలో ముందుగా డబ్బు చెల్లించడం (ప్రీ పెయిడ్ కార్డు) నీటిని పొందవలసి ఉంటుందని పేర్కొన్నారు.
 
అత్యాధునిక హంగులతో ఆత్మకూరు బస్ స్టాండ్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కషితో ఆత్మకూరు బస్టాండ్ రూపురేఖలు మారనున్నాయి. ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ పరిశ్రమ అందించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) నిధుల ద్వారా బస్ స్టాండ్ ని అభివద్ధి చేయనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు.

రూ.1.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో బస్ స్టాండ్ సహా చుట్టు పక్కల చిరు వ్యాపారులకు దుకాణాలు కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు మొదలైన బస్ స్టాండ్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు మంత్రి మేకపాటి ఆదేశించారు. వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నియోజకవర్గ  ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.
 
30న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి 
ఐ.టీ, పరిశ్రమలు,  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  నేతృత్వంలో  మెగా జాబ్ మేళా జరగనుంది. అక్టోబర్ 30వ తేదీ, శనివారం నాడు మంత్రి మేకపాటి ముఖ్య అతిథిగా ఈ ఉద్యోగ మేళా ప్రారంభం కానుంది.

మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గం ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగే మరో భారీ జాబ్ మేళాను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

22  పేరున్న కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొని అర్హులైన 1040 మంది ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు సుమారు 2000 మంది రావచ్చునని మంత్రి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, , మెడికవర్,హెటెరో ఫార్మా వంటివి పాల్గొంటున్నాయన్నారు.

మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు www.apssdc.in ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యనభ్యసించిన వారందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments