Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : శాఖ మంత్రి మేకపాటి

అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : శాఖ మంత్రి మేకపాటి
, శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:57 IST)
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, అక్టోబర్, 22: ఐ.టీ, పరిశ్రమలు,  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  నేతృత్వంలో  మరో వారం రోజుల్లో  మెగా జాబ్ మేళా జరగనుంది. అక్టోబర్ 30వ తేదీ, శనివారం నాడు మంత్రి మేకపాటి ముఖ్య అతిథిగా ఈ ఉద్యోగ మేళా ప్రారంభం కానుంది.

మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గం ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగే మరో భారీ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆహ్వానం పలుకుతోంది. 22  పేరున్న కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొని అర్హులైన 1040 మంది యువతీయువకులకు అందించనున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు.

కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారు, కొత్తగా కొలువు కోరుకొనే ఆత్మకూరు నియోజకవర్గ యువతీ యువకులు, నెల్లూరు జిల్లా నిరుద్యోగులూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హీరో, ఇసుజు, అమరరాజా, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, , మెడికవర్,హెటెరో ఫార్మా వంటివి పాల్గొంటున్నాయి.

మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు www.apssdc.in ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవాలి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యనభ్యసించిన వారందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చు. అభ్యర్థుల వివరాలతో కూడిన సీవీ, రెజ్యుమ్ లతో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధవపత్రాలు. ఆధార్ కూడా తప్పనిసరి ఉండాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజ్జల సూక్తి ముక్తావళి