ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర బంద్‌కి పిలుపునివ్వగా వైసీపీ నిరసనలతో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 36 గంటల దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇదిలావుంటే, పోటాపోటీ ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. అటు నేతల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరి హైవొల్టేజ్ పాలిటిక్స్ మొదలయ్యాయి.