Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త బ‌య‌ట‌కు వెళ్లగానే ప్రియుడితో చాటింగ్, చివ‌రికి హ‌త్య‌

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (12:13 IST)
ప్రియుడు మోజులో పడి భర్తను హత్య చేసిన మహిళ ఉదంత‌మిది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో భార్య లీల‌లివి. భర్త ఉద్యోగానికి వెళ్లగానే ప్రియుడితో చాటింగ్ చేస్తూ, ఈ మహిళా అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. వద్దని వారించిన భర్తతో గొడవపడింది. చివరికి భ‌ర్త‌నే చంపేసి నాటకమాడింది. కానీ అడ్డంగా దొరికింది. 
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారి పల్లెకు చెందిన వాసు చిత్తూరు కలెక్టరేట్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు ఇతనికి కొన్నేళ్ల క్రితం స్వప్నప్రియతో పెళ్లైంది. వారికీ ఒక కుమారుడు కూడా  ఉన్నాడు. భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్వప్నప్రియా తరచూ అతన్ని ఏకాంతంగా కలుస్తుండేది.

భార్య ప్రవర్తన, ఎప్పుడు సెల్ పోన్లో మాట్లాడుతుండటం చూసి అనుమానించిన వాసు ఆమెను ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించాడు. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వప్నప్రియా, ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఎవరికి అనుమానం రాకుండా భర్త మెడ విరిచి చంపేసింది.

ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయాడంటూ మృతదేహాన్ని స్వగ్రామమైన అరిగెలవారిపల్లెకు తీసుకెళ్ళింది. వేరే ప్రాంతంలో ఉన్న వీరి కుమారుడు స్వగ్రామానికి వచ్చి త‌న తండ్రి మృతదేహంపై గాయాలుండటంతో అనుమానం వ్యక్తం చేసాడు. తన తల్లి పైనే అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో స్వప్న ప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించ‌గా, చివ‌రికి చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఇలా చాటింగ్ మోజులో హ‌త్య కూడా చేశాన‌ని నేరాన్ని అంగీక‌రించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments