వివేకా హత్య కేసు : సీబీఐ అధికారి, వివేకా కుమార్తె అల్లుడిపై కేసు - చార్జిషీటు కూడా...

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (08:28 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌తో పాటు వివేకా ఏకైక కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ ఎస్పీ రాం సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని, సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు తనను బెదిరించారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పులివెందుల కోర్టులో ఓ ప్రైవేటు కేసు నమోదైంది. ఈ అంశంలో కేసు నమోదు చేయాలంటూ తాజాగా కోర్టు ఆదేశించింది. దీంతో ఆ ముగ్గురిపై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివేకా హత్య కేసులో వైకాపా నేతల పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనపై ఒత్తిడి చేశారని, విచారణ సందర్బంగా సీబీఐ క్యాంపు కార్యాలయంలో తన బిడ్డల ఎదుటే తీవ్రంగా కొట్టారంటూ కృష్ణారెడ్డి అప్పట్లో పులివెందల కోర్టులో ఓ ప్రైవేటు కేసు పెట్టారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంటికి వెళ్లినపుడు, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పులివెందుల న్యాయస్థానం కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే పులివెందుల అర్బన్ పోటీలుసు రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి, తాజాగా చార్జిషీటును కూడా దాఖలు చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments