Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలా? అయితే ఇలా చేయండి?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (12:41 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 12వ తేదీన చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో వీలుకల్పించనుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. మొత్తం పది వేల మందికి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పించనుంది. 
 
నిజానికి ఈ షార్ సెంటర్ నుంచి అనేక ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ, ఆ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అయితే, ఈ నెల 12వ తేదీ నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుంచి ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని మాత్రం పది వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా చర్యలు తీసుకుంది.
 
ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున 2.51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పించింది. ఈ నెల 4వ తేదీ గురువారం అర్థరాత్రి (00.00 గంటలు) నుంచి ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు ఇస్రో వెబ్‌సైట్ www.isro.gov.inలో వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇవ్వనున్నట్టు ఇస్రో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments