Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హై హీల్స్ వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు.....

ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు జీన్స్ వేసుకున్నప్పుడు ఆధునికంగా కనిపించాలనుకున్నప్పుడు అమ్మాయిలు ఎత్తుమడమల చెప్పులు వేసుకుంటారు. అంతకన్నా ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

హై హీల్స్ వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు.....
, శుక్రవారం, 13 జులై 2018 (12:01 IST)
ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు జీన్స్ వేసుకున్నప్పుడు ఆధునికంగా కనిపించాలనుకున్నప్పుడు అమ్మాయిలు ఎత్తుమడమల చెప్పులు వేసుకుంటారు. అంతకన్నా ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
 
ఎత్తుమడమల చెప్పులు వేసుకుంటే మునివేళ్లమీద ప్రభావం పడుతుంది. అందుకే కాలిగోళ్లు మరీ పొడుగ్గా లేకుండా కత్తిరించుకోవాలి. పాదాల పగుళ్లు, ఇతర ఇన్‌ఫెక్షన్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. లేదంటే అవి వేసుకున్నప్పుడు పాదాలపై ఒత్తిడి పడి ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. పాదాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
 
స్నానం చేసే సమయంలో ఫ్యూమిస్ రాయితో మృతచర్మాన్ని తీసేయాలి. స్నానం పూర్తయ్యాక మాయిశ్చరైజర్ లేదంటే పెట్రోలియం జెల్లీతో మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా మారతాయి. చెప్పులు పొడిబారినట్టుంటే ఆవి వేసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది. చాలామందికి కాలమేదైనా సరే పాదాలకు చెమట ఎక్కువగా పడుతుంది.
 
అలాంటి వారు హీల్స్ వేసుకుంటే అవి జారినట్లై పాదాలు బెణుకుతాయి. అందుకే ముందుగా యాపిల్ సిడార్ వెనిగర్‌ని అరికాళ్లకు రాసుకోవాలి. పావుగంట తరువాత కడిగేసుకుంటే చెమట, దుర్వాసనా సమస్యలుండవు. కొత్తగా ఎత్తుమడమల చెప్పులు ప్రయత్నిస్తోంటే సాక్సులు వేసుకోవడం మంచిది. దీనివలన చర్మానికి ఇబ్బంది ఉండదు. నడక అలవాటవుతుంది. నచ్చినవి ఎంపిక చేసుకోవడానికి బదులు పాదాల ఆకృతికి తగ్గట్టు ఎంచుకుంటే నడవడానికి సౌకర్యంగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారా...?