Webdunia - Bharat's app for daily news and videos

Install App

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2

Webdunia
సోమవారం, 22 జులై 2019 (14:56 IST)
యావత్ ప్రపంచం అమితాసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం ప్రకటించినట్టుగానే సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 వాహక నౌక చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళుతోంది. బాహుబలిగా పేర్కొనే జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 రాకెట్‌ బరువు 640 టన్నులు. 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్‌-2 కంపోజిట్‌ మాడ్యూల్‌తో ఈ రాకెట్‌ పయనిస్తుంది.
 
నిజానికి ఈ నెల 15వ తేదీనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది. కానీ, ప్రయోగానికి 56 నిమిషాల ముందు తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయోగాన్ని వాయిదావేశారు. ఈ లోపాన్ని సరిచేసిన శాస్త్రవేత్తలు తిరిగి సోమవారం చేపట్టారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 14.45 గంటలకు జాబిల్లివైపు దూసుకెళ్లేలా ప్రయోగించారు. 
 
ఈ ప్రయోగంలో రాకెట్ ప్రయాణ సమయం 16.31 నిమిషాలుగా ఉంటుంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్‌ మాడ్యూల్‌ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన అధీనంలోకి తీసుకోనుంది.
 
కాగా, ఈ రాకెట్ చంద్రుడి వద్దకు చేరుకునేందుకు 48 రోజుల సమయం పట్టనుంది. భూ కేంద్రం నుంచి చంద్రయాన్‌-2 మాడ్యూల్‌లోని ద్రవ ఇంధనాన్ని అనేక పర్యాయాలు మండిస్తూ కక్ష్యలను మార్పుచేస్తూ చంద్రుడి వైపు పయనింపజేస్తాయి. 23వ రోజున చంద్ర బదిలీ కక్ష్యలోకి చొప్పించనున్నారు. ఆ తర్వాత ఆర్బిటర్‌ సంచరించే కక్ష్యను చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంగా ఉండేలా చేస్తారు. 
 
48వ రోజున అంటే సెప్టెంబరు 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుంది. జాబిల్లిపై దిగిన వెంటనే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వస్తుంది. దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజులపాటు సంచరిస్తూ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments