Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఇంటిపై దాడి కేసు : వైకాపా నేతలకు చుక్కెదురు.. నందిగం సురేష్ పరారీ!!

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (18:48 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో వైకాపా నేతలకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ను వైకాపా నేతలకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైకాపా నేతలు ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 
 
అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై ఇవాళ బుధవారం హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైకాపా నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి రమేశ్‌ నిందితుడిగా ఉన్నారు.
 
మరోవైపు, హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో వైకాపా నేతల అరెస్టుకు రంగం సిద్ధమైంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తున్నట్టు ముందుగానే తెలుసుకున్న సురేష్ ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments