Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ అంబానీతో సహా కేంద్రానికి చంద్రబాబు షాక్... ఆ భూములు ఇచ్చేయండి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చ

Webdunia
సోమవారం, 14 మే 2018 (16:21 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చిన భూములపై ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు సాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం భూములను సేకరించింది. ఐతే ఈ ప్రాజెక్టుల్లో పురోగతి లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయిస్తూ నోటీసులు పంపింది. 
 
అంతేకాదు... ఎల్ఐసీ, ఎస్బీఐ తదితర కార్యాలయాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమిని కూడా తిరిగి తమకు అప్పగించాలంటూ సీఆర్డీయే నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుని అనిల్ అంబానీ కలిసి ప్రాజెక్టుల నిర్మాణం ఏ దశలో వున్నదో వెల్లడిస్తారని సమాచారం. మరి కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments