Webdunia - Bharat's app for daily news and videos

Install App

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (09:32 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు విషెస్ చెప్పారు. 
 
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రాబోయే రోజులన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుదామని ఆకాంక్షించారు. ప్రజలను ఆకాంక్షలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు 
 
విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 
 
అలాగే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉపాధి శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడుని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments