Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మా ఎమ్మెల్యే కనిపించడం లేదు: టిడిపి అధినేతపై పోలీసులకు ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (20:51 IST)
టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు కనిపించడం లేదంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసిపీ కార్యకర్తలు. కుప్పం నుంచి ఏడు పర్యాయాలు వరుసగా గెలుపొందుతూ వచ్చిన చంద్రబాబు మూడుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పం ప్రజల గురించి ఏనాడు పట్టించుకోవడం లేదని.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపొందినా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వైసిపి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ప్రధానంగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అలాంటిది ఏడుసార్లు చంద్రబాబుని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా నేటికి కుప్పంలో ఎమ్మెల్యే కార్యాలయం గాని, చంద్రబాబు నివాసం గాని లేదని అదేవిధంగా మూడున్నర దశాబ్ధాల కాలంగా కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్సించారు.
 
కుప్పం ప్రజలకు అందుబాటులో లేని చంద్రబాబు ఎక్కడున్నా వెతికి పెట్టాలంటూ కుప్పం రూరల్ సిఐ క్రిష్ణమోమణ్ కు వైసిపి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు వైసిపి కార్యకర్తలు సెంథిల్, డాక్టర్ సుధీర్, మునిరత్నం, మురుగేష్, ముక్తియార్ బాషలు. చంద్రబాబు ఆచూకీ చెప్పాలంటూ వైసిపి కార్యకర్తలు కుప్పం చెరువు కట్ట నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments