Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ శివాజీ వెనుక చంద్రబాబు... కన్నా

Webdunia
సోమవారం, 29 జులై 2019 (06:25 IST)
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మీడియాతో మాట్లాడుతూ... గరుడ పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీడీపీ అధినేత శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.
 
ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించి నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం చేసిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు.  ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.

కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని.. అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కుటుంబం కుప్పకూలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీతో పాటు దేశమంతా బీజేపీవైపు చూస్తోందని.. యువత పెద్ద ఎత్తున తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని కన్నా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments