ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బడుగు,బలహీనవర్గాలకు చంద్రబాబు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. దేశచరిత్రలో ఎక్కడాలేని విధంగా నామినేటెడ్ పదవులు, వర్క్స్‌లలో బిసి, ఎస్సీ, ఎస్టి మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
40 ఏళ్ల అనుభవం ఇలాంటి చట్టాలు తయారుచేసేందుకు ఉపయోగించారా? కాని మా 40 ఏళ్ల వయస్సున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచిస్తున్నారు. ఐదేళ్లలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించివారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేశారు చంద్రబాబు. ఆ మలినాన్ని ప్రజలు ఎన్నికలలో మిమ్మల్ని ఓడించడం ద్వారా కడిగేశారు.
చట్టసభలలో ప్రవేశపెట్టిన బిల్లుల ద్వారా సామాజిక విప్లవానికి భరోసా కల్పించారు. గత ప్రభుత్వ పాలకుల్ని ప్రశ్నించేవిధంగా చట్టాలు ప్రవేశపెట్టారు. శాశ్వత ప్రాతిపదికన బిసి కమీషన్ ఏర్పాటు. బిసిఎస్సిఎస్టి మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం. ఈ చట్టాలు చేయాలని ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే కరకట్టపై అక్రమ కట్టడంలో ఉంటూ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారు. ఈ బిల్లుల ద్వారా జగన్ గారికి మంచి పేరు వస్తుందని అసూయతో మాట్లాడుతున్నారు.
ఇలాంటి బిల్లుల్లో చర్చల్లో పాల్గొనడం లేదంటే ఆ బిల్లులను చంద్రబాబు వ్యతిరేకించినట్లే. బడుగు,బలహీన వర్గాలను చంద్రబాబు ఇంతకాలం ఓటుబ్యాంకుగానే చూశారు. మద్యనిషేధానికి చంద్రబాబు వ్యతిరేకమా? లోకాయుక్త బిల్లుకు సవరణ తేస్తే దానికి మీరు వ్యతిరేకమా? అనుకూలమా చెప్పాలి. తూతూ మంత్రంగా కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలనేది మీ నైజం. ఎన్నికల రెండు నెలల ముందు మీరు అమలు చేసిన పధకాలు ఓట్లను కొనుగోలు చేసే పధకాలుగానే రాష్ట్ర ప్రజలు భావించారని చంద్రబాబు తెలుసుకోవాలి.
మీరు దురుద్దేశంతో వాకౌట్ పేరిట ఈ బిల్లులు ప్రవేశపెడుతుంటే పలాయనం చిత్తగించిన అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని ఎప్పుడు చెబుతుంటారు. మాది బిసి లపార్టీ మా వెనకనే ఉన్నారు అని ప్రగల్బాలు పలకడం కాదు. అసెంబ్లీలో చట్టాలు చేసే సమయంలో మీరు 23 మంది మాత్రమే ఉన్నా మీకు జగన్ గారు పదేపదే అవకాశం ఇచ్చినా కనీస సూచనలు చేయలేదు.
మీరు అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యకు మీకు ఇచ్చిన సమయాన్ని పరిశీలించండి. ఎంతగా అవకాశం ఇస్తున్నారో అర్దమవుతుంది.టెండర్లలో 100 కోట్ల రూపాయలు దాటితే దానిని జ్యుడీషయరీ వెరిఫికేషన్‌కు పంపేలా పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలని జగన్ గారు భావిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌలు రైతుల చట్టాలను తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ముఖ్యమంత్రిగారు ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చేలా బడ్జెట్ కేటాయింపులు సైతం చేస్తే ప్రతిపక్షనేతగా విమర్శలు చేస్తున్నారు. ఎల్లోమీడియాతో దుష్ప్రచారం చేయడం సైతం ప్రజలు గమనిస్తున్నారు.
మీ తాబేదార్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి వేల కోట్లు దోచుకున్నారు. మీ మైండ్ సెట్ మార్చుకోండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్దితి లేదు. విద్యారంగంలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పులు చేయబోతున్నాం. పాఠశాల విద్యానియంత్రణ పర్యవేక్షణ, ఉన్నత విద్యనియంత్రణ పర్యవేక్షణకు చట్టాలు. ఈ రెండు బిల్లులు విద్యావ్యవస్దను సమూలంగా మార్పు తెస్తాయి. ఉన్నత విద్య కేవలం ఉన్నత వర్గాలకే కాదు అందరికి అందుబాటులోకి తేవాలనేది ఈ చట్టాల ప్రధానలక్ష్యం.
ప్రైవేటు విద్యాసంస్దలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చి కొన్ని సంస్దలు వందల విద్యాసంస్దలు ప్రారంభించిన చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి వాటికే సమాధానంగా ఈ చట్టాలు తెచ్చాం. ఏభై రోజులలో గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు మీరు 40 ఏళ్ల ఇండస్ట్రీ అయి చేసిన కార్యాక్రమాలపై బహిరంగ చర్చకు సిధ్దం?
బురద జల్లే కార్యక్రమాలు విడనాడండి. మైండ్ సెట్ మార్చుకోండి. గుర్తింపు లేని విద్యాసంస్దల పట్ల విద్యార్దులు విద్యార్దుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంస్దలను సీజ్ చేసినా విధ్యార్దులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.