Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలు, గుండాల మాదిరిగా రైతుల్ని అరెస్ట్ చేస్తారా?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (11:16 IST)
రైతుల అరెస్ట్‌ను టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో రైతుల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని కూడా చంద్రబాబు ఖండించారు. 
రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలన్నారు. భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా..? నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయమన్నారు. 
 
దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా..? జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా..? రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా...? అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా..? మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేస్తారా..? ఆరుగురు రైతులపై ఏడు సెక్షన్లు నమోదు చేస్తారా..? అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలిస్తారా..? రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై ఇంత అమానుషమా..? 33వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లంటారా..? అంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
13 రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా..? వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికం వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments