Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (16:36 IST)
బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి శ్రీ విజయ్‌కుమార్‌గారు ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది. ఆ నివేదికమీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శుల చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి విజయ్‌కుమార్‌ గారిని, విజయ్‌కుమార్‌ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు. 
 
ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళల మీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకారాన్ని బయటపెట్టుకున్నాడు. విజయ్‌కుమార్‌గారి బాధ్యతలు ఏంటో ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ పూర్వకంగా విజయ్‌కుమార్‌గాడు అని సంబోధించడం ద్వారా తనను ఏ వ్యవస్థలూ ఏమీ చేయలేవు, అన్ని వ్యవస్థలనూ నేను మేనేజ్‌ చేస్తున్నాను అనే అహంకార పూరిత వైఖరిని కూడా చంద్రబాబు ప్రదర్శించారు. 
 
40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు భాషా సంస్కారంగాని, కులపరమైన సంస్కారం గాని, సామాజిక న్యాయంపట్ల గౌరవం గాని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం గాని లేవని మరోసారి స్పష్టమైన నేపథ్యంలో ఆయన్ను, ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా అంబేద్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాం. 
 
అంతేకాకుండా స్వయంగా శ్రీ విజయ్‌కుమార్‌ వద్దకు వెళ్లి, ఆయనక్కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేస్తున్నాం. ఇది జరిగేవరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా. అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు వీరుమాత్రమే కాకుండా శాంతిభద్రతలను గౌరవించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును చీకొట్టాలని విజ్ఞప్తిచేస్తున్నాం... అంటూ డిప్యూటీ సీఎం సుచరిత, హోంమంత్రి పినిపె విశ్వరూప్, రాష్ట్ర మంత్రి తానేటి వనిత, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర మంత్రి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments