Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ జగన్‌ను కలిసిన సెంచరీ ప్లైబోర్డ్స్ మెంబర్స్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (19:28 IST)
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్ ప్ర‌తినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ను క‌లిసిన వారిలో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ నూతన ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. 
 
ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో సెంచరీ ఇండియా కంపెనీ భారతదేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్ప‌టికే ఈ సంస్థ‌ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో యూనిట్‌లు ఏర్పాటుచేసింది.
 
ఇక‌ ఏపీలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేప‌ట్ట‌నుంది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం వ‌ల్ల‌ 3,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ల‌బించ‌నున్నాయి. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి.. డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు కంపెనీ సిద్దమవుతుంది. 
 
2024 డిసెంబర్‌ కల్లా మూడు దశల్లో నిర్మాణం పూర్తిచేసుకోనుంది. ఏడాదికి 4,00,000 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి.. మూడు దశలు పూర్తయ్యే సరికి 10,00,000 మెట్రిక్‌ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యం అందించే విధంగా రూపుదిద్దుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments