Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడగింపు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నీలం సాహ్ని పదవీకాలం పొడిగించాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. 
 
వాస్తవానికి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆమె పదవీకాలాన్ని పొడగించాలని కోరుతూ కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన కేంద్రం.. ఆమె పదవీకాలాన్ని జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వరకు పొడగించింది. 
 
గత ఏడాది నవంబరు 13న నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కేంద్ర సర్వీసులు నుంచి రిలీవ్ అయి ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఏపీ సీఎస్‌గా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది. 
 
ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌ ప్రసాద్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత సాహ్ని ఏపీ సీఎస్‌గా పూర్తిస్థాయిలో భాద్యతలు చేపట్టారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. 
 
ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా కూడా పని చేశారు. అంతేకాకుండా నల్గొండ జాయింట్ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు. ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టరుగా కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments