Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్రం షాక్..! రాజధానిని ఎత్తేశారా..?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (05:56 IST)
ఏపీకి రాజధాని లేదా.. నిజమా అంటే.. అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. కావాలని చేశారో.. తెలీక చేశారో కానీ.. ఏపీకి రాజధాని లేకుండా చేశారు. దీంతో.. ఏపీకి చెందిన నేతలు, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇంతకీ కేంద్రం చేసిన ఆ పని ఏంటి..!
 
గత కొన్ని రోజులుగా.. ఏపీ రాజధానిపై.. ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. రాజధాని మా ప్రాంతంలో కావాలంటే.. మాకు కావాలని.. పలు జిల్లాలకు చెందిన వారు నిరసనలకు, గొడవలకు దిగుతోన్నారు.

అందులోనూ.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఏపీ రాజధాని.. అమరావతినే అని ఫిక్స్‌ అయి.. అక్కడ.. రైతుల నుంచి భూములను కూడా తీసుకుని.. పెద్ద ఎత్తున నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో.. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ వచ్చాక.. రాజధానిపై పెద్ద దుమారమే లేచింది.

కాసేపు ప్రకాశం జిల్లాలోని దొనకొండ అని.. మరోవైపు కర్నూలు అని పలు ప్రాంతాలు చర్చలకు వచ్చాయి. అయితే.. రాష్ట్రంలో ఇంత జరుగుతోన్నా.. ఏపీ రాజధాని అంశంపై కానీ.. దాని గురించి ప్రస్తావన కానీ.. చేయలేదు సీఎం జగన్.
 
అయితే.. కేంద్రం ప్రభుత్వం కూడా.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అనుకుందో ఏమో.. కానీ.. తాజాగా.. విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ సర్కార్ భారత దేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది.

ఇందులో 28 రాష్ట్రాలతో పాటు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే.. కేంద్రం విడుదల చేసిన ఈ మ్యాప్‌లో.. అన్ని రాష్ట్రాలకూ.. రాజధానులను తెలిపింది.. కానీ ఒక్క ఏపీకి తప్ప. ఏపీ రాజధాని.. మ్యాప్‌లో లేకపోవడం.. ఇటు నేతలకు అటు ప్రజలకు ఆశ్చర్యం కల్గిస్తోంది.

అమరావతి అని పేర్కొన్నా పెద్ద రచ్చ లేకపోయేది కానీ.. ఇప్పుడు మొత్తానికి ఏపీకి రాజధానిని ఎత్తేయడంతో.. ఇప్పుడు ఫుల్లుగా.. రచ్చ షురూ అయ్యింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments