Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడవిలో రాజధాని పెట్టారు.. మంత్రి బొత్స

అడవిలో రాజధాని పెట్టారు.. మంత్రి బొత్స
, బుధవారం, 30 అక్టోబరు 2019 (21:51 IST)
రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వ  అవినీతిపై అందరికీ అర్ధమయ్యే భాషలోనే మాట్లాడినా, టిడిపి నేతలు అర్దం కానట్టు ప్రవర్తిస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

స్వే్ర్‌ ఫీట్‌కి రూ.10 వేలు ఖర్చుపెట్టి.. మరలా హైదరాబాద్‌లో నిర్మాణ వ్యయం ఇంత కంటే  తక్కువ అవుతుందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలచే తిరస్కరించబడినా టిడిపి నేతలు ప్రజలను ఇంకా ఏరకంగా మభ్యపెట్టాలా అని చూస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నేతలు నోరు విప్పితే ఒక్కటి నిజం లేదన్నారు.

ప్రజలు ఐదేళ్లు అధికారమిస్తే ఒక్కటైనా శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ అన్నీ తాత్కాలికమేనన్నారు. సచివాలయం నిర్మాణంలో పదివేల రూపాయలు స్క్వేర్‌ ఫీట్‌కు ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు.

తాను సామాజిక వర్గాల ప్రస్తావన తెచ్చానంటున్నారని, పదిమందిలో తొమ్మిది మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటే అనడం తప్పెలా అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన చుట్టాలు, పక్కాలు, ఆయన పార్టీకి చెందిన నాయకులే ఉన్నారని, ఈ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాలను అధికార జులుంతో,బలంతో వారి దగ్గరనుంచి దోపిడీ చేశారన్నారు.

చంద్రబాబు హయామంలో ఇచ్చిన అద్భుతమైన జీవో..  అసైన్డ్‌ భూములుంటే... ఆసైనీ పట్టా దారుడు మరో థర్డ్‌ పార్టీకి అమ్మితే వారికి అసైన్‌ ల్యాండ్‌ చెందేటట్టు చేయడం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఆయన వియ్యంకుడు వెంకటరావు ఆయన కొడుకు భరత్‌ లకు గత ప్రభుత్వం  ఎకరా రూ.50 లక్షలకు ఇచ్చారని, ఆ తర్వాత ఆ భూములను సీఆర్డీయేలో కలిపారని... ఇంత కంటో నిదర్శనమేం ఉంటుందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు రాసిన లేఖ అబద్దాలు, లోపభూయిష్టమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రాజధానిని అడవిలా తయారు చేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. అసలు చంద్రబాబు నాయుడే రాజధాని పేరుతో అడవిలోకి తీసుకొచ్చారన్నారు.

కనీసం రాజధాని పై గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని చెప్పారు. అమరావతి ఏ రకంగా సెల్ఫ్‌ పైనాన్స్‌ ప్రాజెక్టో చెప్పాలన్నారు. కనీసం టీ కూడా దొరకడం లేదని హైకోర్టు కామెంట్‌ చేసింది గత ప్రభుత్వాన్నని... ఐదేళ్ల పాటు ఉన్న ప్రభుత్వం కనీసం చాయ్‌ కూడా దొరకని చోట ఎందుకు పెట్టారని ఆక్షేపించిందన్నారు.

అందుకే తాము కమిటీ వేశామని, ప్రజాభిప్రాయం ప్రకారం అందరూ ఏం చెపితే అదే చేస్తామన్నారు.  ప్రజల మనోభావాల ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఐదేళ్లు ఇక్కడున్న వాడివి చంద్రబాబు నువ్వు కనీసం ఇళ్లు కూడా ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. 

హైదరాబాద్‌లో మాత్రం రూ.250 కోట్లతో ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకున్న చంద్రబాబు... రాజధాని మార్పుతో అడవిలో తీసుకొచ్చి అందరినీ వదిలేశారన్నారు. అసలు ఈ రాష్ట్రంలో శాశ్వత అడ్రస్‌లేని వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయుకుడు కావడం. దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

రాజధాని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అన్న చంద్రబాబు వ్యాఖ్యల మీద మండిపడ్డ మండ్రి బొత్స ..దేశంలో ఎక్కడైనా 50 అంతస్ధుల ప్రభుత్వ కార్యాలయ భవనం ఉందా... అని ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో మేం దీన్నుంచి బయటకెళతామంటే... మాకేం అభ్యంతరం లేదని చెప్పామన్నారు.

కానీ ఏ రకంగా మీరు మాకు ఆదాయం ఇస్తారో చూపించాలని అడిగాం. దీంతో పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామంటే,  మేం కూడా అంగీకరించామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించిన తర్వాత ఎస్సీలకు 19.08శాతం, ఎస్టీలకు 6.77శాతం, బీసీలకు 34శాతం వెరసి 59.95 శాతం ప్రకారం లోకల్‌ బాడీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామని బొత్స తేల్చి చెప్పారు. 

త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వస్తుంది. సుమారు 60శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లబోతున్నాం. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి కోర్టులను ఒప్పించి తగిన నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఆర్‌టీసీ సమ్మె: కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? నష్టాలు, జీతాలపై సీఎం లెక్కల్లో వాస్తవాలేమిటి?