Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండి

Advertiesment
ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండి
, మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:13 IST)
ఏపీ రాజధాని, ఇతర ప్రాజెక్టులపై ప్రజల నుంచి వినతులు నిపుణుల కమిటీ ఆహ్వానించింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, అమలు తీరు..రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనలు ఇవ్వాలని కోరింది.

ఆ సూచనలను ఈమెయిల్ [email protected] లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. నవంబర్‌ 12లోగా ఈ మెయిల్‌ లేదా పోస్ట్‌ ద్వారా పంపాలని సూచించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి గడిచిన మూడు నెలలుగా గందరగోళం నెలకొంది.

అసలు రాజధానిని అమరావతిలో కొనసాగిస్తారా..? లేక వేరే ప్రాంతానికి తరలిస్తారా..? అన్న అంశం అన్ని వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అదే విధంగా ప్రాజె క్టుల్లో అవినీతి చోటుచేసుకుందని ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతూ ప్రజాధనాన్ని ఆదా చేసే పనిలో ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మో హన్‌ రెడ్డి రాజధాని నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టులపై అధ్యాయనం చేసేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌.రావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీని సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ సోమవారం అమరావతి నిర్మాణం, ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రజల సూచనలను, అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ పట మటలో ఉన్న తమ కార్యాలయానికి నవంబరు 12లోపు ప్రజలు, ఇతర ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలను పంపించాలని సూచించింది.

తమ తమ అభిప్రాయాలను మెయిల్‌ ద్వారా గానీ, లేఖల రూపంలో పంపించవచ్చని వెల్ల డించింది. ప్రజల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ కమిటీ తన నివే దికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తరువాత దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలిఫోర్నియాలో కార్చిచ్చు