Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో యువ‌త‌కు ఉద్యోగాలు లేక‌నే డ్ర‌గ్స్, లైంగిక దాడులు!

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోంద‌ని, కేంద్ర మాజీ  మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్  చింతా మోహన్ విమ‌ర్శించారు. డ్రగ్స్, గంజాయి య‌ధేచ్ఛ‌గా రవాణా సాగుతోంద‌ని, మహిళలు, బాలికపై లైంగిక దాడులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. అయితే, ఇవన్నీ జ‌రుగుతోంది... రాష్ట్రంలో నిరుద్యోగం వల్ల‌నే అని ఆయ‌న సూత్రిక‌రించారు. యువ‌త‌కు ఉద్యోగాలు లేకపోవ‌డం వ‌ల్లే ఇలాంటివి సంభవిస్తున్నాయ‌ని చెప్పారు.
 
ఉద్యోగాలు లేక యువత చీప్ క్వార్ట‌ర్ కొట్టి, గంజాయి తాగి రోడ్డులపై వీరంగం స్పష్టిస్తున్నార‌ని చింతా మోహ‌న్ అన్నారు. సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా చూపడం అవసరమా? అని చింతా మోహ‌న్ ప్ర‌శ్నించారు. వీలైతే డ్రగ్స్, గంజాయి సరఫరా అయ్యే చోటును నిర్మూలనం చేసే సత్తా ప్రభుత్వానికి లేదా? అని నిల‌దీశారు. 
 
రాజకీయాల్లో బెగ్గర్స్ బిలీనీయర్స్ అవుతున్నార‌ని, రాష్ట్రంలో ప్రజలు పేదరికంతో బతుకుతుంటే, నాయకులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. తీహార్ జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళుకు  సైతం టిటిడి బోర్డులో చోటు కల్పించడం సిగ్గు చేట‌న్నారు. చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నాన‌ని చింతా మోహ‌న్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే, అధికార పార్టీ గౌరవం నిలబడుతుంద‌న్నారు. 
 
ఏపి పిసీసీ ప్రెసిడెంట్ మార్పు విషయంలో పార్టీ ఆలోచన చేస్తోంద‌ని, ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడి కోసం వెతుకుతున్నామ‌ని చింతా మోహ‌న్ చెప్పారు. దీపావళి తరువాత కొత్త పీసీసీ ఎంపిక జ‌రుగుతుంద‌న్నారు.
 
సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం