Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు విచారణ : సీబీఐ అధికారులకు వార్నింగ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (09:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బెదిరించారు. ఈ కేసు విచారణను తక్షణం నిలిపివేసి కడపను వీడి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులపై సీబీఐ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వలీబాషాను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీనిపై ఆయన కడప చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ బెదిరింపులపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 8వ తేదీన సీబీఐ అధికారులకు భోజనం తెచ్చేందుకు వలీబాషా కారులో కడపలోని హరిత హోటల్‌ నుంచి బైపాస్ రోడ్డులోని డాబాకు వెళ్లారు. భోజనం పట్టుకుని తిరిగి వస్తుండగా, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారుకు బైకును అడ్డుగా పెట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. 
 
సీబీఐ అధికారులతో పాటు నువ్వు కూడా దర్యాప్తును ఆపేసి కడపను వదిలి తక్షణం వెళ్లిపోవాలి. లేదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దండుగులు తనను బెదిరించిన విషయమై ఈ నెల 9వ తేదీన వలీబాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments