Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిగో పులి... ఇదిగో తోక... జగన్ గుండెల్లో రైళ్లంటూ...!!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఇదీ ఇప్పుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో జరుగుతున్న గోల. ఇంతకీ ఏంటయా సంగతి అంటే... జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అప్పట్లో విచారణ చేసిన సీబీఐ జేడీ ఐపీఎస్‌ అధికారి

Webdunia
శనివారం, 13 మే 2017 (20:43 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఇదీ ఇప్పుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో జరుగుతున్న గోల. ఇంతకీ ఏంటయా సంగతి అంటే... జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అప్పట్లో విచారణ చేసిన సీబీఐ జేడీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమ్యాయట. తెలుగువారైన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు ఐపీఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు.
 
ఆ ప్రాంతంలోనే ఇప్పుడు అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్నారు. మధ్యలో కొంతకాలం కేంద్ర సర్వీసులకు వెళ్లి హైదరాబాద్‌ సీబీఐ విభాగం జేడీగా వచ్చారు. జెడీ హయాంలోనే జగన్‌ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్‌ కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వంటి సంచలనాత్మక కేసులు దర్యాప్తు జరిగాయి. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 
 
డిప్యుటేషన్‌ పూర్తికావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ హైదరాబాద్‌ రావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు ప్రభుత్వాలూ అంగీకరిస్తే జెడి మళ్లీ డిప్యుటేషన్‌పై ఇక్కడకు రావడానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. జె.డి. తెలుగు రాష్ట్రానికి వస్తే మళ్లీ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు తప్పవనీ, అందుకే ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఐతే అసలు సీబీఐ అధికారి లక్ష్మినారాయణ ఇక్కడికి బదిలీ అవుతారా... అయితే మాత్రం జగన్ కేసును మళ్లీ ఆయనే చూస్తారా అన్నది ప్రశ్న. ఐతే దీనిపై చర్చ మాత్రం ఓ స్థాయిలో పరుగులు తీస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేశారు : మంచు మనోజ్ (Video)

అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి నుంచి దేశీ రాజుగా విక్రమ్ ప్రభు గ్లింప్స్

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1

విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన డియర్ కృష్ణ ట్రైలర్

'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments