Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడితో పిజ్జా షాపుకెళ్లిన ఆర్మీ స్కూల్ టీచర్‌ దారుణ హత్య: 28సార్లు కత్తితో పొడిచి?

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన మహిళ దారుణ హత్యకు గురైంది. పిజ్జా కొనుక్కునేందుకు తన 15 ఏళ్ల కుమారుడితో కలిసి వెళ్లిన కొద్ది సేపటికే.. ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఏకంగా 28 సార్లు కత్తితో పొ

Webdunia
శనివారం, 13 మే 2017 (18:46 IST)
ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన మహిళ దారుణ హత్యకు గురైంది. పిజ్జా కొనుక్కునేందుకు తన 15 ఏళ్ల కుమారుడితో కలిసి వెళ్లిన కొద్ది సేపటికే.. ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఏకంగా 28 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన హర్యానాలోని పంచకుల సెక్టార్-20లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతురాలు రీనాదేవి (39) చండీమందిర్‌లో గల ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి మార్కెట్లోని పిజ్జా షాపుకు కుమారుడితో వెళ్లారు. కారుతో పాటు ఆమె అదృశ్యమయ్యారు. కానీ గురువారం అర్థరాత్రి చండీమందిర్ - రామ్‌గఢ్ రోడ్డులోని భందెర్ ఘాట్ వద్ద తన కారులోనే ఆమె హత్యకు గురై రక్తపు మడుగులో కనిపించారు.
 
రీనాదేవి భర్త సందీప్ కుమార్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన ఓ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీనాదేవి ఉద్యోగరీత్యా ఇద్దరు కుమారులతో కలిసి చండీమందిర్‌లోని ఓ ఫ్లాటులో ఉంటున్నారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో సందీప్ కుమార్ కలుసుకుంటారు. అయితే ఈ వారంతం రీనాను కలవకముందే ఆమె హత్యకు గురైంది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే అందిన పోస్టు మార్టం రిపోర్టులో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌ వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. రీనాపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. అయితే  15 ఏళ్ల రీనా కుమారుడు తన తల్లి మార్కెట్ నుంచి అదృశ్యమైనా ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసుపై విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments