Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ కావాలి : సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (08:26 IST)
రాజ‌కీయంగా మ‌హిళ‌ల‌కు 33 శాతం కాదు... 50 శాతం రిజ‌ర్వేష‌న్ కావాల‌ని సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, విద్య, ప‌రిశోధ‌న‌, వాణిజ్యంతోపాటు రాజ‌కీయ స‌హ‌కారం కూడా ఎంతో ముఖ్య‌మ‌న్నారు. 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ త‌న పుట్టిన రోజు వేడుక‌ను అనాధ బాల‌ల మ‌ధ్య జ‌రుపుకున్నారు. 
 
స్థానిక బావాజీపేట‌లోని న‌వ‌జీవ‌న్ బాల భ‌వ‌నం బాల‌ల మ‌ధ్య కేక్ క‌ట్ చేసి, వారితో స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. అనాథ బాల‌బాలిక‌ల‌కు ఆయ‌న ద‌గ్గ‌రుండి వ‌డ్డ‌న చేశారు. న‌వ‌జీవ‌న్ బాల భ‌వ‌నంలో ఉండి ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటున్న బాల‌బాలిక‌ల‌తో ఇష్ఠాగోష్ఠిలో పాల్గొన్న జేడీ వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. 
 
మ‌హిళ‌ల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ కూడా స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డం లేద‌ని, కొన్ని చోట్ల భ‌ర్త, ఇత‌రులు అధికారం చెలాయించే దుస్థితి ఉంద‌న్నారు. రాజ‌కీయ వ్య‌వ‌స్థ బాగుంటేనే, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో తాను ఎన్నిక‌ల బ‌రిలో ఖ‌చ్చితంగా నిలుస్తాన‌ని, చ‌ట్ట స‌భ‌ల‌కు త‌న‌ను పంపితే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ పై నిల‌దీస్తాన‌ని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌ని, విద్యార్థులు ప్ర‌శ్నించ‌గా... త‌నది స‌రికొత్త ప్ర‌జల‌ పార్టీ అని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పుకొచ్చారు. 
 
యువ‌త‌రం చ‌దువులు చ‌దివి, ఉన్న‌త స్థానాల‌ను ఆక్ర‌మించి, దేశాభివృద్ధికి రాజ‌కీయ తోడ్పాటు కూడా అందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆప్ రాష్ట్ర నాయ‌కులు పోతిన వెంక‌ట రామారావు, న‌వ‌జీవ‌న్ బాల భ‌వ‌నం ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఫాద‌ర్ అంత‌య్య‌, ఫాద‌ర్ ఇగ్నిషియ‌స్, పి.ఆర్.ఓ. మ‌స్తాన్ పాల్గొన్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణతోటు, ఆయ‌న నిర్వ‌హిస్తున్న జేడీ ఫౌండేష‌న్ స‌భ్యులు బ్ల‌డ్ బ్యాంక్ లో ర‌క్త‌దానం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments