Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బిగ్ బాస్'' షోపై జేడీ.. సెలెబ్రిటీలతో కాదు.. రైతులతో నిర్వహించాలి..

''బిగ్ బాస్'' షోపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో బిగ్ బాస్ షోను చూడటం సమయం వృధా అంటూ యువతకు సూచించిన జేడీ.. ప్రస్తుతం బిగ్ బాస్ షోను రైతులతో నిర్వహించాలని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలతో కా

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (15:18 IST)
''బిగ్ బాస్'' షోపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో బిగ్ బాస్ షోను చూడటం సమయం వృధా అంటూ యువతకు సూచించిన జేడీ.. ప్రస్తుతం బిగ్ బాస్ షోను రైతులతో నిర్వహించాలని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలతో కాకుండా రైతులతో ఈ షో నిర్వహించాలన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా లక్ష్మీ నారాయణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ''ప్రజాస్వామ్మ పరిరక్షణ సదస్సు''లో మాట్లాడుతూ.. సామాజిక వర్గం కంటే, సమాజమే ముఖ్యమని.. ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలు మళ్లించాలని.. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలని సూచించారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలోని సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని.. ఇప్పటికే ఆయన అపాయింట్‌మెంట్ కోరానని జేడీ తెలిపారు. చంద్రబాబుతో అపాయింట్ మెంట్ తేదీ ఫిక్స్ కాగానే తాను గుర్తించిన సమస్యలను ఆయనకు చేరవేస్తానని తెలిపారు. 
 
ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments