Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ చూడటం ఎందుకు..? 2 గంటలు వేస్ట్ చేసుకోవడం ఎందుకు?: జేడీ

బిగ్ బాస్‌ షో అంటేనే ప్రస్తుతం అందరూ ఎగబడుతున్నారు. రోజూ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 తెలుగు షోను చూసేందుకు జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. దీనికోసం ఏం జరిగినా రెండు గంటలు సమయాన్ని షో కో

Webdunia
బుధవారం, 18 జులై 2018 (12:43 IST)
బిగ్ బాస్‌ షో అంటేనే ప్రస్తుతం అందరూ ఎగబడుతున్నారు. రోజూ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 తెలుగు షోను చూసేందుకు జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. దీనికోసం ఏం జరిగినా రెండు గంటలు సమయాన్ని షో కోసం కేటాయించేస్తున్నారు. ఒకవేళ షో చూసేందుకు మిస్ అయినా మరుసటి రోజు యూట్యూబ్‌లో వీక్షిస్తున్నారు.


ఇలా యువతకు తెగనచ్చే రియాల్టీ షో బిగ్ బాస్‌పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో చూడటం కోసం యువత ప్రతి రోజు 2 గంటల సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని జేడీ వ్యాఖ్యానించారు. 
 
దేశానికి ఉపయోగపడే విధంగా యువత తయారవ్వాలంటే కొన్ని పద్ధతులను పాటించాలని జేడీ హితవు పలికారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని, మెదడును మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్టు మన శ్వాసను మన కంట్రోల్‌లో ఉంచుకోగలిగితే... మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుందని చెప్పారు. ప్రాణాయామం చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చని తెలిపారు. 
 
ఇక బిగ్ బాస్ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుంటుందని... అందరి మైండ్‌లను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటాడని, బిగ్ బాస్‌ను మాత్రం ఎవరూ కంట్రోల్ చేయరని జేడీ అన్నారు. మన మెదడును మనమే నియంత్రించుకోవాలంటే.. ప్రాణాయామం చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments