Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. అగ్నికి ఆహుతైన కారు

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:35 IST)
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
 
ఆ కారు ఇంజిన్ ముందు భాగంలో మొదలైన మంటలు కొద్దిసేపట్లోనే కారంతా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, కారులోని భక్తులు వెంటనే కిందకి దిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేశారు.
 
ఇదిలా వుండగా తిరుపతిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస సేతుపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుండి ఢీకొట్టింది మరో కారు. ఢీ కొన్న కారు బోల్తా కొట్టడంతో ప్లైఓవర్ పై నిలిచిపోయాయి వాహనాలు. సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. కేసు నమోదు చెసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments