Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటికాలిపై వస్తున్నారు.. నాకూ టైమ్ వస్తుంది : చంద్రబాబు

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:56 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టివార్నింగ్ ఇచ్చారు. తనకూ ఓ టైమ్ వస్తుందని, అపుడు తన విశ్వరూపం చూపిస్తానంటూ హెచ్చరించారు. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు. 
 
వీటిపై చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ తనపై ఒంటికాలిపై లేస్తున్నాడని, తనకూ టైమ్‌ వస్తుందన్నారు. తప్పులు చేసిన పోలీసులు, అధికారులు ఎప్పటికీ తప్పించుకోలేరని బాబు మరోమారు హెచ్చరించారు. రాజధానికి వెళ్లకుండా అడ్డుకుంటారా.. ప్రజలందరూ ఏకమై పోరాటం చేస్తే జగన్‌ పులివెందుల పారిపోతాడని జోస్యం చెప్పారు. 
 
పోలీసులు లేకుండా సీఎం ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టలేడన్నారు. దుర్మార్గ సీఎంను ఇంటికి పంపేందుకు ప్రజలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిని కాపాడుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మనకు తిండి పెట్టేది ఉద్యోగం, అభివృద్ధి.. కులం, మతం కాదన్నారు. 
 
విద్యార్థులకు స్కాలర్‌షిప్పులే ఇవ్వలేడు కానీ అమ్మ ఒడి ఇస్తాడా? ప్రజలు తెలిసో తెలియకో నెత్తిపై కుంపటి పెట్టుకున్నారు. నెత్తిన కుంపటి దించలేరు... తప్పించుకోలేరు. నాడు ఊరూరుకు వచ్చాడు ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.. భరించక తప్పదు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments