Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు బీభత్స కసరత్తు.. చివరి క్షణం వరకు ఊపిరాగిన మంత్రులు

శనివారం సాయంత్రం నుంచి ఏపీ మంత్రులకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. కేబినెట్ విస్తరణ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చివరిక్షణం వరకు చేసిన భారీ కసరత్తు మూలంగా ఎవరు మంత్రులుగా ఉంటారో ఊడతారో తెలియని సస్పెన్స్‌‌తో మంత్రులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి తుద

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (02:18 IST)
శనివారం సాయంత్రం నుంచి ఏపీ మంత్రులకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. కేబినెట్ విస్తరణ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చివరిక్షణం వరకు చేసిన భారీ కసరత్తు మూలంగా ఎవరు మంత్రులుగా ఉంటారో ఊడతారో  తెలియని సస్పెన్స్‌‌తో మంత్రులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి తుది జాబితా ప్రకటించిన క్షణంలోకానీ చాలామంది మంత్రులు తేరుకోలేదు. రోజులో శరవేగంగా మారిన రాజీకీయ పరిణామాల ఫలితంగా పలుమార్లు పలువురు మంత్రుల, ఎమ్మెల్యేల భవిష్యత్తు గీతలు తారుమారయ్యాయి. కొత్తగా కేబినెట్లోకి చేరినవారు, చివరి నిమిషంలో సేప్ జోన్‌లోకి వెళ్లినవారు, వైకుంఠపాళిలో నిచ్చెనమెట్ల కిందికి దొర్లి పడినవారు సస్పెన్స్ సినిమాకు మించిన ఉత్కంఠ రాజ్యమేలింది.
 
శనివారం సాయంత్రం మంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యింది మొదలుగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ టెన్షన్  పెరిగిపోయింది.  విడతలవారీగా చంద్రబాబు మంత్రులతో భేటీ అవుతుండటంతో కేబినెట్‌ భేటీ అనంతరం పలువురు మంత్రులతో రాజీనామాలు చేయిస్తారనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో పలువురు మంత్రుల్లో అలజడి మొదలైంది. తమ మంత్రి పదవిపై వేటు పడుతుందుమో అనే భయం పలువురు మంత్రుల్లో కనిపించింది. మరోవైపు పదవుల కోసం ఆశావహులు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. మరోవైపు చివరి నిమిషంలో అయినా ఛాన్స్‌ దక్కకపోతుందా అనే ఆశతో... ఆశావహులు, అసంతృప్తులు విజయవాడలోనే మకాం వేశారు.
 
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రాజకీయ, సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. మంత్రుల జాబితాను గవర్నర్‌ నరసింహన్‌కు పంపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 20 మంది సభ్యులున్నారు. వాస్తవంగా 26 మందికి అవకాశం ఉంది. 5గురి తొలగింపు, కొత్తగా 11 మంది చేరికతో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరనుంది. కొత్త మంత్రులుగా 11 మందితో ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డిలను కేబినెట్‌ నుంచి తొలగించారు.
 
రావెల కిషోర్‌బాబు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో మంత్రివర్గం నుంచి తప్పించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో చురుగ్గా పనిచేయలేకపోవడంతో తొలగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పీతల సుజాతకు ఉద్వాసన పలికారు. కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వాల్సి రావడంతో అదే కుటుంబానికి చెందిన కిమిడి మృణాళినిని పక్కకు తప్పించారు. పనితీరు సరిగా లేదనే నెపంతో పల్లె రఘునాథ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కూడా తొలగించాలని నిర్ణయించినా అగ్రిగోల్డ్‌ ఉదంతంతో ఆయన వేటు నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
 
వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), చిత్తూరు నుంచి అమర్‌నాథ్‌రెడ్డి(పలమనేరు), వైఎస్సార్‌ జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు), విజయనగరం జిల్లా నుంచి సుజయకృష్ణ రంగారావు(బొబ్బిలి)కు అవకాశం కల్పించారు. ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే అనుమానం ఉన్నప్పటికీ న్యాయ నిపుణులతో చర్చించి, మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
 
ఉభయ గోదావరి జిల్లాల నుంచి జ్యోతుల నెహ్రూ, వేటుకూరి శివరామరాజు, షరీఫ్‌లకు మంత్రి పదవులు దక్కడం ఖాయమనుకున్నా సమీకరణల్లో అవకాశం లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి నుంచి అనూహ్యంగా కొత్తపల్లి జవహర్‌కు చోటు కల్పించడంతో ఆ జిల్లా నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మైనారిటీ కోటాలో కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు మంత్రి పదవి ఖరారు చేసినా ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. 
 
ప్రస్తుత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలుండగా వారిలో పీతల సుజాత, మృణాళినికి ఉద్వాసన పలికారు. కొత్తగా అఖిల ప్రియకు చోటు కల్పించారు.  మైనారిటీలు, గిరిజనులకు ఈసారి కూడా అవకాశం కల్పించలేదు.  అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆయనను చీఫ్‌విప్‌గా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
శనివారం రాత్రి ఖరారైన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఓ ఆసక్తికర పరిణామం. మూడేళ్లుగా టీడీపీ చీఫ్‌ విప్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలువ శ్రీనివాసులుకు మంత్రిపదవి దక్కగా, మంత్రిగా కొనసాగుతున్న పల్లె రఘునాథరెడ్డిని కేబినెట్‌ నుంచి తప్పించి చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టారు. పల్లె నియామకానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
 
వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంపై మొదటినుంచి తీవ్ర వ్యతిరేకత కనబర్చిన టీడీపీ సీనియర్‌ నేత రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఎట్టకేలకు బుజ్జగించారు. గవర్నర్‌కోటా ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డిని ఖరారుచేసి, ఆయనను మండలిలో విప్‌గా నియమించనున్నట్లు సమాచారం.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్‌పై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్ - వివాదానికి ఆజ్యం (Video)

Nakkina Thrinadha Rao: తెలుగుకి అలా సరిపోరు.. తిని సైజులు పెంచమని చెప్పా- నక్కి (video)న

ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ పట్టుకోగలుగుతున్నా : హీరో విశాల్ (Video)

ఎపుడు కోలుకుంటానో భగవంతుడికే తెలియాలి : రష్మిక మందన్నా

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments