Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు మోడీ టోపీ... హరిబాబుకు నిరాశ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. 9 కొత్త ముఖాలకు స్థానం కల్పించినప్పటికీ తాజా విస్తరణలో తెలుగు రాష్ట్రాల నేతలకు స్థానం కల్

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (13:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. 9 కొత్త ముఖాలకు స్థానం కల్పించినప్పటికీ తాజా విస్తరణలో తెలుగు రాష్ట్రాల నేతలకు స్థానం కల్పించడం విశేషం. మంత్రి పదవి ఊహాగానాల నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు తీవ్ర నిరాశ ఎదురైంది. అలాగే, తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్థానంలో వెదిరె శ్రీరామ్‌ లేదా మురళీధర్‌ రావును తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. అయితే వారిని కూడా మోడీ పక్కనబెట్టారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమోట్ కావడానికి తోడు, కేంద్ర మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇద్దరు కేబినెట్ మినిస్టర్స్ పదవులను త్యాగం చేసింది. ఈ స్థానంలో ఒక్కరికైనా స్థానం కల్పిస్తారని అందరూ భావించారు. కానీ, ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. దీంతో కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏపీ నుంచి అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి మంత్రులుగా ఉండగా, తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఏపీతో సంబంధం ఉన్న నిర్మలా సీతారామన్‌‌కు కేబినెట్‌ హోదా ప్రమోషన్‌ కల్పించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments