Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు బాతుగుడ్లు మాకవసరంలేదు: బుగ్గన రాజేంద్రనాథ్

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (13:35 IST)
ఏపీని రెండులక్షల అప్పులకు తీసుకువెళ్ళింది చంద్రబాబు కాదా..? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ అన్నారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 40వేల కోట్ల బకాయిలను చంద్రబాబు పెట్టి వెళ్లారు. చంద్రబాబు ఏపీని నంబర్ వ‌న్ ప్లేస్‌లో ఉంచామని పచ్చి అబద్దం చెబుతున్నారు. చదువులో (లిటరసీలో)36 స్థానంలో ఉంటే మొదటిస్థానం అని ఎలా చెబుతారు.? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
నీతి ఆయోగ్ చెప్పిన దాంట్లో ఆక్సెస్ అవుట్‌కమ్‌లో మాత్రమే టాప్ ఫైవ్‌లో ఉంటే .. మొత్తం అన్నింట్లో ఫస్ట్ అని చెప్పారు. హైద్రాబాద్‌ను కట్టింది చంద్రబాబు ఐతే.. కులీకుతుబ్ షా ఏం చేసినట్లు? అని అడిగారు.

సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వంకు ఎలాంటి సంబంధం.. ఒప్పందాలు జరగలేదు. కొన్ని సింగపూర్‌లోని కంపెనీలకు మాత్రమే ఎంవోయూ ఉంది అని తెలియ‌చేసారు. లక్ష కోట్లు పెట్టి మేము నగరాలను కట్టలేం. పేదలకు మంచి పాలన ఇవ్వడమే మా లక్ష్యం. అమరావతి పేరుతో బంగారు గుడ్లు సంపాదించుకోవాలని చంద్రబాబు అనుకున్నారు.
 
మాకు ఆ బంగారు గుడ్లు అవసరం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేసారు. యూనిట్‌కు 2.50 వచ్చే దాన్ని 4.50 పైసలు ఎందుకు విద్యుత్ కొన్నారు. ఆ అక్రమ పిపిఏలపైనే రివ్వ్యూ చేస్తున్నాం.. తప్పేంటి? అని ప్ర‌శ్నించారు. నా నియోజకవర్గంలో ఇసుకనే ఉండదు.. నేనెలా అమ్ముకుంటున్నా? మా దగ్గర ఒక్క నడికూడా లేదు. కనీసం వాస్తవాలు కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? అని అడిగారు. 
 
మద్యం పర్మిట్ రూమ్‌లు తగ్గిస్తే.. చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? ఎక్కువ దుకాణాలు పెట్టి ప్రజలు ఎక్కువ తాగుబోతులు కావాలా? అని అడిగారు. బిల్డ్ ఏపీ అని యూనివర్సిటీ భూములు అమ్ముతున్నారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు.. ఇంగ్లిష్ మీడియం వద్దని ప్రజల్లో చులకనయ్యారు.
 
చంద్రబాబు నేనే విజ‌నరీ అంటూ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. చంద్రబాబు పాలనలో దోచుకోవడాన్ని రివ్వ్యూ చేస్తామన్నందుకే భయం అని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments