Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు సీరియస్ : గన్నవరం ఎమ్మెల్యేపై వేటుపడింది

చంద్రబాబు సీరియస్ : గన్నవరం ఎమ్మెల్యేపై వేటుపడింది
, శుక్రవారం, 15 నవంబరు 2019 (18:00 IST)
టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వేటుపడింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వంశీ వ్యవహారం చర్చకొచ్చినట్లు తెలిసింది. 
 
వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశాడని.. వైసీపీలోకి వెళ్లేందుకే పార్టీపై దుమ్మెత్తిపోశాడని మెజార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. దీంతో... పార్టీపై ఉద్దేశపూర్వకంగా ఎవరు ఈ తరహా వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు వంశీని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నేతలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. 
 
వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు ఈ పరిణామంతో మార్గం సుగమమైందని చెప్పవచ్చు. రాజీనామా చేసిన సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వంశీ కొన్ని రోజులకే మాట మార్చారు. జగన్‌‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ కుండబద్ధలు కొట్టారు. అంతేకాదు, టీడీపీపై.. పార్టీ అధినేత చంద్రబాబుపై, లోకేష్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేకపోతున్నారని అన్నారు.
 
45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు... అధికారం లేకపోతే ఐదారునెలలు కూడా ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఇసుక కోసం దీక్షలు చేయటం సరికాదన్నారు. అకాల వర్షాలు, అతివృష్టి, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కూడా నదుల, కాలువల నుంచి ఇసుకను తీసే టెక్నాలజీని చంద్రబాబు ఏమైనా కనిపెట్టారా అని వంశీ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనిచేస్తే సమర్థించాలని, అలాకాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు వ్యతిరేకించగానే, మీ వెనుక దూడల్లాగా అనుసరిస్తే అభాసుపాల అవుతామన్నారు. ఇంగ్లీషు మీడియంను సమర్థించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీషు వద్దని చెప్పటం లేదు కదా అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాన్స్‌పోర్టు బిజినెస్ మానేస్తున్నా... వెళ్లేవాళ్లు రాళ్లు వేయడం సహజమే : జేసీ దివాకర్