Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ నుంచి వంశీని జగన్ అందుకే బయటికి లాగేశారా?

టీడీపీ నుంచి వంశీని జగన్ అందుకే బయటికి లాగేశారా?
, గురువారం, 31 అక్టోబరు 2019 (12:29 IST)
తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. ఇంకా ఆయన వైకాపాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. వైకాపాలో వంశీకి ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మంత్రులు ఉన్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా వారే చ‌క్క‌పెడుతున్న‌ట్టు కూడా టాక్‌. ఇంత‌కు ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రో కాదు.. ఒక‌రు కొడాలి నాని అయితే మ‌రొక‌రు పేర్ని నాని.
 
ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలుగుదేశానికి విధేయుడైన వంశీ వైసీపీలోకి వెళ్లడానికి కారణాలున్నాయి. అంతేగాకుండా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో ఆతనికి మంచి రిలేషన్ వుంది. గ‌తంలో వంశీ ఓ సారి జ‌గ‌న్‌ను బ‌హిరంగంగానే విజ‌య‌వాడ‌లో వాటేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు. ఇక జ‌గ‌న్ భార్య భార‌తికి వంశీ భార్య‌తో కూడా ప‌రిచ‌యాలు ఉన్నాయి.
 
ఈ ఎన్నిక‌ల‌కు ముందే వంశీ వైసీపీలోకి వెళ్లి గ‌న్న‌వ‌రంలో పోటీ చేస్తార‌న్న టాక్ కూడా బ‌లంగా వ‌చ్చింది. కానీ ఇప్పుడే వంశీకి వైకాపాలోకి చేరే సమయం వచ్చిందని టాక్ వచ్చింది. ముఖ్యంగా వంశీకి చినబాబు అంటే అస్సలు నచ్చదట. ఇకపోతే.. జ‌గ‌న్ కోణంలో కూడా వంశీని వైసీపీలోకి తీసుకునేందుకు ప్లాన్ ఉంద‌ట‌.
 
ఇటీవ‌ల హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఏకంగా 43 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది. అస‌లు ప్ర‌తిప‌క్షాల‌కు ఈ విజ‌యం త‌ర్వాత నోట మాట రావ‌డం లేదు. వైసీపీ ప్ర‌భుత్వంపై ఐదు నెలల్లోనే వ్య‌తిరేక‌త ఉంద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు గ‌న్న‌వ‌రంలో భారీ మెజార్టీతో విజ‌యం సాధిస్తే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న మచ్చ తొలగిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం.
 
పైగా హుజూర్‌న‌గ‌ర్ కాంగ్రెస్‌కు కంచుకోట‌.. అది ఆ పార్టీ సిట్టింగ్ సీటు అక్క‌డ టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు గ‌న్న‌వ‌రం టీడీపీ కంచుకోట‌… అది టీడీపీ సిట్టింగ్ సీటు. అక్క‌డ వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి, సీఎం జ‌గ‌న్ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. సేమ్ హుజూర్‌న‌గ‌ర్ సీన్ రిపీట్ అయిన‌ట్టు ఉంటుందనే ప్లాన్‌తోనే జగన్ వంశీని టీడీపీ నుంచి బయటికి లాగినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్‌: రైలులో అగ్నిప్రమాదం, 60 మంది ప్రయాణికుల మృతి