Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ అంతులేని విధేయత... కేంద్రానికి లోకువగా మారిన ఆంధ్రప్రదేశ్!

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:41 IST)
దాదాపు నాలుగు పదులకుపైగా అవినీతి కేసుల్లో చిక్కుకుని కాలం వెళ్లదీస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం పెద్దల చూపిస్తున్న వీర విధేయత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారింది. రాష్ట్ర సమస్యలపై కనీసం గట్టిగా అడగలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దీనికి కారణం అవినీతి కేసుల్లో చిక్కుకుని, బెయిలుపై ఉండటమే. ఫలితంగా కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారు.
 
నిజానికి వైకాపా విపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిందేనని రంకెలు వేసింది. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ,25 మంది ఎంపీలన్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీల్నిసాధిస్తామని అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఊరారా తిరుగుతూ పదేపదే చెప్పారు. ప్రజలను నమ్మించారు. కానీ, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఫ్లేటు ఫిరాయించేశారు. కేంద్రం పెద్దలంటే అంతులేని విధేయత చూపుతూ, కనీసం గట్టిగా అడిగేందుకు కూడా జంకుతూ నాలుగేళ్లు గడిపేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం చేష్టులుడిగి చూస్తుండటం, కేంద్ర ప్రభుత్వానికి మరింత లోకువగా మారింది. ఈ బడ్జెట్‌లో కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌లకు నిధులు కేటాయింపుపై వైకాపా ఎంపీలు పెదవి విప్పలేని దయనీయ స్ధితిలో ఉన్నారు. నిజానికి విశాఖ రైల్వే జోన్ ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. అడుగు ముందుకు పడటంలేదు. మొత్తంమీద అవినీతి కేసుల్లో చిక్కుకుని ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిని చేయడంతో దానికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga vamsi: లోక చాప్టర్ 1: షోలు రద్దు కావడం వల్ల నిర్మాత నాగ వంశీకి లాభమా నష్టమా?

నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్‌గా ఉంటారు : కమిలినీ ముఖర్జీ

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments