Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సింగ్ న‌గ‌ర్లో దారుణం, బాలిక‌పై అత్యాచారం

Webdunia
గురువారం, 22 జులై 2021 (23:15 IST)
కృష్ణా జిల్లా విజయవాడలో మరో దారుణం చోటు చేసుకుంది. ప‌దిహేనేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటను అజిత్ సింగ్ నగర్లో వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్  నగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉండే బాలిక ఓ దుకాణంలో పని చేస్తూ రోజూ ఆటోలో వెళ్లి వస్తుండేది.

ఈ క్రమంలోనే ఆమెకు ప్రకాష్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ వల్లెపు వసంతకుమార్(19)తో పరిచయం ఏర్పడింది. దుకాణం ప‌ని అయిపోయాక‌, రాత్రి 11 గంటల సమయంలో తన ఆటోలో కొద్ది మంది ప్రయాణికులతో పాటుగా బాలికను ఎక్కించుకున్నాడు వ‌సంత కుమార్. ఇత‌ర ప్రయాణికులను మాత్రం రాజీవ్ నగర్లో దింపేశాడు.

అనంతరం బాలికను ఎక్సెల్ ప్లాంటు సమీపం వాంబే కాలనీలోని న్యూ ఎన్ఎన్ఎయూఆర్ఎం అపార్టుమెంట్ల వద్దకు తీసుకెళ్లాడు. అక్క‌డ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను ఇంటి పరిసర ప్రాంతంలో దింపేసి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాలికను తల్లి నిలదీయగా, జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్యాచారం, పోక్సా యాక్టు ప్రకారం డ్రైవర్ పై కేసు నమోదైంది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments