Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన 19 రోజులకే అన్న ఆత్మహత్య.. పెళ్లైన 4 నెలలకు తమ్ముడు కూడా ఉరేసుకున్నాడు!

ఒకే ఇంట అన్నాదమ్ముళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరు నెలల క్రితం.. అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటే.. తమ్ముడు కూడా కొత్తగా పెళ్ళైన నాలుగు నెలల్లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. వివ

Webdunia
గురువారం, 21 జులై 2016 (13:01 IST)
ఒకే ఇంట అన్నాదమ్ముళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరు నెలల క్రితం.. అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటే.. తమ్ముడు కూడా కొత్తగా పెళ్ళైన నాలుగు నెలల్లోనే  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డి పేటకు చెందిన నాగుల శ్రీనివాస్ (27) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

శ్రీనివాస్‌కు నాలుగు నెలల క్రితమే లతతో వివాహం జరిగింది. మెకానిక్‌గా పనిచేస్తూ, తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ వచ్చిన శ్రీనివాస్‌కు ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ భార్య, తల్లిని పొలం వద్ద వదిలిపెట్టి వచ్చిన శ్రీనివాస్.. ఇంట్లో స్లాబుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
పొలం వద్ద పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తలుపులు తట్టినా తీయలేదు. దీంతో డోర్లు బద్ధలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే.. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందాడు. ఆరునెలల క్రితమే శ్రీనివాస్ అన్నయ్య శ్రీకాంత్ కూడా ఇదే రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లైత 19 రోజులకే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన నుంచి తేరుకోకముందే శ్రీనివాస్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇక శ్రీనివాస్‌ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నోట్‌లో అమ్మానాన్నల మాట వినకపోవడం వల్లే తనకీ శిక్షంటూ శ్రీనివాస్ రాశాడు. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని.. అప్పులు చేయడం వల్లే తనకీ పరిస్థితి ఏర్పడిందని రాశాడు. ఇంకా భార్య లత చాలా మంచిదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments