Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నీవు లేకుండా బతకలేను తల్లీ అన్నా..'' కనికరించని బిడ్డ.. ప్రేమ కోసం వెళ్ళిపోయింది..!

సోషల్ మీడియా ప్రభావంతో చాటింగ్‌లు డేటింగ్‌లు అంటూ నేటి యువత పెడదారిన పోతున్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొందరు మోసపోతుంటే.. మరికొందరు ప్రేమకోసం తల్లిదండ్రులను కూడా వద్దనుకుంటున్నారు. తాజాగా అలాంటి

Webdunia
గురువారం, 21 జులై 2016 (12:37 IST)
సోషల్ మీడియా ప్రభావంతో చాటింగ్‌లు డేటింగ్‌లు అంటూ నేటి యువత పెడదారిన పోతున్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొందరు మోసపోతుంటే.. మరికొందరు ప్రేమకోసం తల్లిదండ్రులను కూడా వద్దనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన గంగరబోయిన మౌనిక అనే యువతి.. కాంపెల్లి గ్రామానికి చెందిన గంగరబోయిన రవీందర్‌ కూతురు మౌనిక జూన్‌ 25న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కూతురు కోసం బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో వెతికిన రవీందర్‌ ఈ నెల 5న సీరోలు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. 
 
మౌనిక కోసం పోలీసులు విచారణ చేపట్టగా, మౌనిక అదే గ్రామానికి చెందిన కొండ విజయ్‌ అనే యువకునితో ఈ నెల 8న హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండి ఆర్య సమాజ్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు ఈ విషయాన్ని మౌనిక తండ్రి రవీందర్‌కు చెప్పారు. ప్రేమ పెళ్ళికి రవీందర్ దంపతులు ఒప్పుకోలేదు. అయితే మౌనిక మాత్రం తాను మేజర్‌నని, తన ఇష్టం మేరకే పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
 
"నీవు లేకుండా నేను బతకలేను తల్లీ.. నిన్ను పై చదువులు చదివించాలనుకున్నానమ్మా" అంటూ ఎంత బతిమాలినా.. మౌనిక మాత్రం ప్రేమ కోసం తల్లిదండ్రులను వదులుకుంటానని తెగేసి చెప్పేసింది. దీంతో ఆ కన్నతండ్రులు తలదించుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఘటన పోలీసులనే కంటతడి పెట్టించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments