Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన తొలిరాత్రే భార్యపై బ్లేడుతో దాడి.. ఆడపిల్ల పుట్టిందని పరార్

మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెళ్లైన తొలిరోజే భార్య పట్ల ఓ శాడిస్టు భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను బ్లేడుతో కోసి చిత్రహింసలకు గురిచేశాడు.

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (18:05 IST)
మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏపీలోని  చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెళ్లైన తొలిరోజే భార్య పట్ల ఓ శాడిస్టు భర్త  అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను బ్లేడుతో కోసి చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో పెళ్లైన తెల్లవారే నవ వధువు ఆస్పత్రిలో చేరింది. వివరాల్లోకి వెళితే... టీచర్‌గా పనిచేస్తున్న భర్త రాజేష్.. భార్య శైలజపై బ్లేడుతో ఒళ్లంతా గాయాలు చేశాడు. 
 
అలాగే కత్తితో కాళ్లు, చేతులను కోసి తన శాడీజాన్ని చూపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శైలజ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విడిచిపెట్టి విదేశాలకు పారిపోయాడు. వివరాల్లోకి వెళితే విశాఖ నగరానికి చెందిన ఫాతిమా అనే యువతికి, నవాజ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇటీవలే ఓ ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఎవరికీ చెప్పకుండా నవాజ్ విదేశాలకు పారిపోయాడు. 
 
ఆడపడుచు, అత్తమ్మ ఫాతిమాను ఇంటి నుంచి గెంటేయడంతో ఫాతిమా మహిళా సంఘాలకు ఫిర్యాదు చేసింది. విశాలాక్షి నగర్‌లో అత్తింటి ముందు మహిళ సంఘాలతో కలిసి ధర్నాకు దిగింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments