Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అరెస్టు : లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:52 IST)
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనసాగిస్తూ వచ్చిన యువగళం పాదయాత్రకు కొన్ని రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. 
 
పాదయాత్ర శుక్రవారం నాటికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేయడంతో... శనివారం ఉదయం లోకేశ్‌ హుటాహుటిన బయల్దేరి విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచి న్యాయనిపుణులతో సంప్రదిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండు విధించడంతో... పరిస్థితులు చక్కబడేంత వరకూ పాదయాత్రను తాత్కాలికంగా ఆపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారని సమాచారం. 
 
చంద్రబాబు అరెస్టు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691...  
 
స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను ఆదివారం అర్థరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా, అక్కడ ఆయనకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు. 
 
ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతోనే ఆయనను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాన్వాయ్ వెంట రాగా ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఓ భద్రతా సిబ్బంది కూడా ఆయనను అనుసరించారు. మార్గమధ్యంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ కాగా దాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకూ చంద్రబాబు ప్రయాణించే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
 
ఆదివారం అర్థరాత్రి చంద్రబాబు కాన్వాయ్ జైలుకు చేరుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయనను జైలు అధికారులకు అప్పగించారు. జైల్లో అధికారులు చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించడంతో పాటూ కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినందున ఖైదీ దుస్తులకు బదులు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతించారు. అప్పటివరకూ చంద్రబాబు వెంట వచ్చిన ఆయన తనయుడు లోకేశ్ అధికారుల అనుమతితో జైల్లో కాసేపు చంద్రబాబుతో మాట్లాడి వచ్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments