Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిన్నారి మృత్యుంజయుడు.. బతికి బట్టకట్టాడు..!

ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడితే మన పెద్దవారు.. అబ్బ.. ఇతడికి భూమ్మీద నూకలున్నాయని చెబుతుంటారు. 20 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఆ చిన్నారి చివరకు మృత్యుంజయుడయ్యాడు. 11 గంటల పాటు బోరుబావిలోనే ఉన్న చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. ఈమధ్య కాలంలో బోర

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (18:49 IST)
ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడితే మన పెద్దవారు.. అబ్బ.. ఇతడికి భూమ్మీద నూకలున్నాయని చెబుతుంటారు. 20 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఆ చిన్నారి చివరకు మృత్యుంజయుడయ్యాడు. 11 గంటల పాటు బోరుబావిలోనే ఉన్న చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. ఈమధ్య కాలంలో బోరుబావిలో పడిన చిన్నారులను ప్రాణాలతో బయటకు తీయడం ఇదే ప్రధమమని అందరూ భావిస్తున్నారు.
 
గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంకు చెందిన మల్లిఖార్జున్, అనూషల కుమారుడు రెండేళ్ళ చంద్రశేఖర్ నిన్న ఇంటిలో ఆడుకుంటూ బయటకు వచ్చి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. చిన్నారి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ ఎఫ్‌ బృందం తీవ్రంగా శ్రమించింది. ప్రాణాలతో బయటకు తీసేందుకు యత్నించింది. 11 గంటల పాటు శ్రమించి బోరుబావికి ఎదురుగా మరో గుంతను త్రవ్వి క్షేమంగా బయటకు తీసింది. తెల్లవారు జామున 2.30 గంటలకు చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు.
 
చిన్నారి బయటకు రావడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. గత కొన్నినెలలుగా బోరుబావిలో పడిన చిన్నారులను ఎంత ప్రయత్నించినా క్షేమంగా బయటకు తీయలేకపోయారు. కానీ చంద్రశేఖర్‌ను మాత్రం ప్రాణాలతో బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments