Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువని పలకరిస్తే పెళ్లన్నాడు.. నో చెప్పడంతో.. ఇంటికొచ్చి గొంతుకోసేశాడు.. ఎక్కడ?

బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తరచూ ఆమెను కలిశాడు. ఏదో బంధువే కదా అని ఆమె కూడా పలకరించింది. అయితే పెళ్లి మాటెత్తాక ఆమె ససేమిరా అంది. ఆమె తల్లిదండ్రులూ ఒప్పుకోలేదు. బంధువు కావడంతో పలకరిం

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (14:31 IST)
బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తరచూ ఆమెను కలిశాడు. ఏదో బంధువే కదా అని ఆమె కూడా పలకరించింది. అయితే పెళ్లి మాటెత్తాక ఆమె ససేమిరా అంది. ఆమె తల్లిదండ్రులూ ఒప్పుకోలేదు. బంధువు కావడంతో పలకరించానే తప్ప తనకు ఆ ఐడియా లేదని చెప్పేసింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు అమ్మాయి ఇంటికెళ్లి గొంతు కోసేశాడు. ఈ ఘటన విజయనగరంలోని గాజులరేగలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గాజులరేగకు చెందిన ఓ యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎస్‌.కోటకు చెందిన కుసుమంచి విక్రమ్‌ ఆమెకు దగ్గర బంధువు. ఎంబీఏ పూర్తి చేసి ఊరిలోనే ఉంటున్న విక్రమ్ తరచూ ఆమెను కలిసేవాడు. ఆమెనే వివాహం చేసుకోవాలని.. పది రోజుల క్రితం తన మేనత్త, సోదరిని గాజులరేగ పంపి యువతి తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకు రమ్మన్నాడు. కానీ విక్రమ్‌కు తన బిడ్డనివ్వమని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.
 
దీంతో సోమవారం యువతి ఇంటికి వచ్చిన విక్రమ్ ఆమె తల్లిదండ్రులతో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి చివరకు యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో గొంతు కోసేశాడు. విక్రమ్‌ను అడ్డుకున్నా ప్రయత్నం లేకపోయింది. దీంతో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పరారైన విక్రమ్‌ను పోలీసులు గాలిస్తున్నారు.

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments