బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టయ్యాడు. నల్లపాడు పోలీసుల అదుపులో వున్నాడు. వైకాపా హయంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనిల్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పలు విద్యా సంస్థల అధినేత కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను డబ్బులు డిమాండ్ చేసి.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు.
అయితే తన భర్త నిర్దోషి అని, తనను వదిలిపెట్టాలని మాజీ రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ భార్య మౌనిక డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని భార్య మౌనిక ఆరోపించారు.
తన భర్తకు ఎలాంటి నోటీస్ లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగులగొట్టి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. తన భర్త ను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అని మౌనిక వీడియో విడుదల చేశారు.